దేవగుడి సినిమాతో... హీరో కావాలనే నా కల నెరవేరింది:అభినవ్ శౌర్య

దేవగుడి సినిమాతో... హీరో కావాలనే నా  కల నెరవేరింది:అభినవ్ శౌర్య

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘దేవగుడి’. ఈనెల 30న సినిమా విడుదల  కానుంది. శనివారం  ట్రైలర్  లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అభినవ్ శౌర్య మాట్లాడుతూ ‘ హీరో  కావాలనే నా ఎన్నో ఏళ్ల కల ఈ చిత్రంతో నెరవేరటం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన రామకృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్.

  ఇలాంటి  చిన్న చిత్రాలను ఆదరిస్తేనే  మాలాంటి కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు. తెలుగమ్మాయిగా ఈ చిత్రంతో పరిచయం అవడం ఆనందంగా ఉందని అనుశ్రీ  చెప్పింది.  ఇందులో తానొక కీలక పాత్ర పోషించినట్టు నటుడు రఘు కుంచె చెప్పారు.  దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అన్ని అంశాలు ఆకట్టుకుంటాయి.  నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో రూపొందించాను.  స్క్రీన్‌‌‌‌ప్లే చాలా షార్ప్‌‌‌‌గా ఉంటుంది’ అని అన్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ కే మదీన్,  డీవోపీ లక్ష్మీకాంత్ కనిక పాల్గొన్నారు.