గ్రామీణ యువత జాతీయ క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే బాలునాయక్

 గ్రామీణ యువత జాతీయ క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ, వెలుగు:  గ్రామీణ యువత జాతీయ క్రీడల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. గ్రామీణ యువతకు కబడ్డీ ప్రధాన క్రీడగా మారిందని, క్రీడల ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

త్వరలో దేవరకొండలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి, క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ యార్డులో 309 మంది లబ్ధిదారులకు రూ.1.25 కోట్ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.