ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలి : దేవర కొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలి : దేవర కొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
  •     అధికారుల సమీక్ష లో   ఎమ్మెల్యే బాలునాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, 

దేవరకొండ, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌‌‌‌తో కలిసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఒకవేళ వర్షానికి ధాన్యం తడిచినా కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. 

దేవరకొండ నియోజకవర్గంలో ఈసారి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. డిండి మండలంలో ఇంకా కోతలు కొనసాగుతున్నాయని, అక్కడి ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా కలెక్టర్, జేసీ ఆధ్వర్యంలో చర్యలు కొనసాగించాలని సూచించారు. రానున్న పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని తెలిపారు. నియోజకవర్గంలో 12 రైస్ మిల్లుల మిల్లర్లు ధాన్యం సేకరణలో భాగస్వామ్యం కావాలని కోరారు   ఈ కార్యక్రమంలో నల్గొండ జేసీ శ్రీనివాస్, ఇన్‌‌‌‌చార్జ్ ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, డీఎం రాంపత్తి నాయక్, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు.