రాజకీయాల్లో దేవెగౌడ కుటుంబం రికార్డు

రాజకీయాల్లో దేవెగౌడ కుటుంబం రికార్డు

బెంగళూరు : జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబం అరుదైన ఘనత సాధించింది. పార్లమెంట్ తో పాటు కర్నాటక అసెంబ్లీలోని ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబంగా రికార్డు సృష్టించింది. మంగళవారం వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో దేవెగౌడ మనవడు హెచ్ డీ రేవణ్ణ కుమారుడు సూరజ్ హసన్ స్థానం నుంచి గెలుపొందాడు. దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పెద్ద కొడుకు రేవణ్ణ హొలెనర్సిపుర నుంచి చిన్న కుమారుడు హెచ్ డీ కుమార స్వామి చెన్నపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుమారస్వామి భార్య అనిత రామనగర నియోజకవర్గ ఎమ్మల్యేగా ఉన్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్ హసన్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎంపీగా సేవలందిస్తున్నారు.  తాజాగా సూరజ్ విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. ఆయన తల్లి జిల్లా పరిషత్  సభ్యురాలు కాగా.. కుమారస్వామి కొడుకు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.