రామయ్యా.. ఈ జీవితం నీకే అంకితం.. దైవిక పాత్రలోనే ఆఖరి శ్వాస

రామయ్యా.. ఈ జీవితం నీకే అంకితం.. దైవిక పాత్రలోనే ఆఖరి శ్వాస

దేశమంతటా రామభక్తి ఉప్పొంగుతున్న తరుణంలో హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. భివానీలో జరిగిన రామ్ లీలా కార్యక్రమంలో హనుమంతుడి పాత్రలో ఉన్న హరీష్ మెహతా అకస్మాత్తుగా కుప్పకూలాడు. యావత్ దేశం అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేసిన వేడుకల్లో మునిగితేలుతుండగా, రామ్ లీలా కార్యక్రమంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రామ్ లీలా కార్యక్రమాలో హరీష్ మెహతా హనుమంతుడి పాత్రను పోషించాడు. ఈ నాటకంలో శ్రీరాముని పాదాలకు నమస్కరించే ఆచారం ఉంది. అయితే, హరీష్ మెహతా ఈ భంగిమను చేస్తుండగా.. అతను ఊహించని విధంగా కుప్పకూలిపోయాడు. ఇది ప్రేక్షకులను కలవరపరిచింది. అనంతరం అతన్ని లేపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రారంభంలో, ప్రేక్షకులు ఇది నాటకంలో భాగమని భావించారు. కానీ అతను ఎంతసేపటికీ లేవకపోయేసరికి ఆందోళనకు గురయ్యారు. అనంతరం హరీష్‌ను ఆంచల్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కళకే అంకితమైన జీవితం

విద్యుత్ శాఖకు చెందిన రిటైర్డ్ జూనియర్ ఇంజనీర్ హరీష్ మెహతా గత 25 ఏళ్లుగా హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. పాత్ర పట్ల అతని నిబద్ధత అతన్ని ఈ ప్రాంతంలో రామ్ లీలా సంప్రదాయంలో అంతర్భాగంగా చేసింది.

దైవిక పాత్రలోనే ఆఖరి శ్వాస

హనుమాన్‌గా హరీశ్‌ వంగి నమస్కరించడంతో హరీష్‌ ఆఖరి చర్యగా మారినట్లు కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఆంచల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రాంతంలోని సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు హరీష్ మెహతా సహకారం గుర్తించిన అక్కడి అక్కడి ప్రజలు..  హనుమంతుని గౌరవనీయమైన పాత్రను మూర్తీభవిస్తూ తన చివరి శ్వాసను విడిచిపెట్టిన అంకితభావంతో కూడిన నటుడికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు