లక్నోలో నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలంటూ ఒత్తిడి పెడుతున్న తండ్రిని కొడుకు కాల్చి చంపేసి... ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు చేపట్టిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ హత్యకు కారణం నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమని ఒత్తిడి పెట్టడం కాదని... తండ్ర మన్వేంద్ర సింగ్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడటమేనని విచారణలో తేలిందని వెల్లడించారు పోలీసులు.
రెండో పెళ్లి విషయంలో మన్వేంద్ర సింగ్, అతని కొడుకు అక్షత్ ప్రతాప్ సింగ్ మధ్య గొడవలు జరిగేవని..తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని ప్రతాప్ సింగ్ కలత చెందాడని తెలిపారు బంధువులు. నిందితుడు ప్రతాప్ సింగ్ తండ్రిని చంపిన తర్వాత మృతదేహం పక్కన నాన్ వెజ్ తిన్నాడని పోలీసులు తెలిపారు. తన అత్త ఇంటికి వెళ్లి చికెన్, పన్నీర్ కర్రీ చేయించుకున్నానని... ఇంటికి వచ్చి తన చెల్లెలు కృతి సింగ్ తో కలిసి తిన్నానని... ఆ సమయంలో తండ్రి శవం ఇంట్లోనే ఉన్నట్లు నిందితుడు చెప్పినట్లు తెలిపారు పోలీసులు.
►ALSO READ | అది ఇల్లా.. నోట్ల కట్టల గోదామా.. ఆ ఇల్లంతా నోట్ల కట్టలే.. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి రేంజ్ ఇదీ..!
ఈ హత్యలో ప్రతాప్ సింగ్ చెల్లెలు కృతి సింగ్ పాత్రపై విచారణ చేపట్టారు పోలీసులు. హత్యకు ముందే నిందితుడు రంపం, డ్రమ్ము కొన్నట్లు తెలిపారు పోలీసులు.ఫిబ్రవరి 20న తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో సింగ్ లైసెన్స్ పొందిన రైఫిల్‌ని ఉపయోగించి నిద్రపోతున్న తన తండ్రి తలపై కాల్చాడని తెలిపారు పోలీసులు. తన తండ్రి ఊపిరి ఆగిపోయే వరకు అతను పక్కనే ఉన్నాడని.. ఆ సమయంలో అతని చెల్లెలు కూడా రూమ్ లోనే ఉన్నట్లు తెలిపారు పోలీసులు.
హత్య తర్వాత, అక్షత్ మృతదేహాన్ని మూడవ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు ఈడ్చుకెళ్లి, బాత్రూంలో ఉంచి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, అవశేషాలను డ్రమ్ములో పెట్టాడని తెలిపారు పోలీసులుఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణం, ప్రణాళిక, ఇతర కుటుంబ సభ్యుల పాత్ర వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
