బాసరకు పోటెత్తిన భక్తులు

బాసరకు పోటెత్తిన భక్తులు

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వేకువ జామున శ్రీ మహాలక్ష్మీ, సరస్వతి, మహంకాళీ అమ్మవార్లకు వేదపండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక క్యూ లైన్ల, మండపాలు, తాగునీటి వసతి, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

వరంగల్ కు కంపెనీలు క్యూ కడుతున్నయ్ 

యాదగిరిగుట్టలో రోడ్లు కొట్టుకుపోవడం చిన్న సమస్యే