
వంట చేసేటప్పుడు కొన్ని పద్దతులను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద.. ఐశ్వర్వం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి వంటగది ఎలా ఉండాలి.. ఆహారం తయారు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ..
పొద్దున్న లేస్తే చాలు.. మహిళలు కిచెన్ లో బిజీ బిజీగా గడుపుతారు.. ఇప్పుడంటే స్విగ్గీ.. జొమాటో వచ్చాయనుకోండి.. అది వేరే విషయం. పురాణాల్లో శ్రీమహావిష్ణువు .. లక్ష్మీ దేవికి చెప్పిన వివరాల ప్రకారం. మనిషి జీవించి ఉన్నప్పుడే కాదు... మరణం తర్వాత ఆత్మకు కూడా ఆకలి వేస్తుంది.. అప్పుడు కూడా వంట చేసుకుంటుందట. ఆ సమయంలో జీవించి ఉన్నప్పడు కిచెన్ లో వంట ఎలా తయారుచేశాము.. నియమాలు.. పద్దతులు పాటించామా లేదా.. అన్న విషయాలను లెక్కలేస్తారని గరుడ పురాణం ద్వారా తెలుస్తోంది.
హిందువుల ఇళ్లలో పూజా మందిరానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారో.. వంట గదికి కూడా అలాంటి ఇంపార్టెన్సేఇస్తారు. పురాణాల్లో వంట తయారు చేసేందుకు కొన్ని పద్దతులు.. నియమాల గురించి రుషి పుంగవులు తెలిపారు.ఏ వస్తువు వంటగదిలో ఉంటే శ్రీ మహాలక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుందో వివరించారు.
పురాణాల ప్రకారం ఆహారం వండటానికి వెళ్లినప్పుడల్లా ప్రతి సారి ముందుగా వంటచేసే స్టవ్‌కు నమస్కారం చేయాలి. అలా దండం పెట్టి అగ్నిదేవుడిని ప్రార్ధించిన తరువాత ఆహారం వండటం మొదలు పెట్టాలి. అందుకే పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగే సమయంలో వంట వారు స్టవ్ వెలిగించే ముందు కొబ్బరికాయకొట్టి దండం పెట్టి ప్రారంభిస్తారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితిల్లో స్టవ్‌ను వెలిగించరాదు.
ఆహారం తయారైన తరువాత మొదటగా అగ్నిదేవుడికి సమర్పించాలి. అంటే వండిన పదార్దాన్ని నైవేద్యంగా స్టవ్ వెలుగుతుండగానే అగ్ని దేవుడికి సమర్పించాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేస్తే అలాంటి ఇంట్లో తప్పకుండా శ్రీ మహాలక్ష్మీ దేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం.. కటాక్షం ఉంటే.. ఆర్థిక సమస్యలు ఉండవు.. అప్పుల భారం తొలగిపోయి.. భగవంతుని ఆశీస్సులతో ఇంటిలో లేదు అనే మాట ఉండదనిపురాణాలు చెబుతున్నాయి.
పండితులు తెలిపిన వివరాలప్రకారం లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చే పనులు చేయకూడదు. వంటగది శుభ్రంగా లేకపోతే అమ్మవారికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారట. అందుకే వంటగదిని శుభ్రంగా.. మురికి లేకుండా ఉంచుకోవాలి. వాడేసిన గిన్నెలు.. కూరగాయల చెత్త ఎప్పటి కప్పడు క్లీన్ చేసుకోవాలి. చెత్త చెదారం.. వాడిన పాత్రలు.. షింక్ దగ్గర నీట్ గా లేకుండా.. మురికి ఉంటే అక్కడ జేష్టాదేవి ఉంటుంది. జేష్టాదేవి వస్తుందంటే లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు.