మంచి అలవాట్లు.. మంచి గుణాలు ఉన్నాయని ఎవరికి వాళ్లు చెప్పు కుంటే సరిపోదు. మంచి వాళ్లని ఇతరులు గుర్తించాలి. అంతేకానీ నేను మంచి వాడిని ... గొప్పవాడిని అనుకోకుండా, ప్రతి రోజూ ఏఏ పనులు చేస్తున్నారో ఒక్కసారి ఎవరికి వాళ్లు గుర్తు చేసుకోమని చెప్తుంది భారతీయ ధర్మం.
ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో తప్పులు చేయడం సహజం. అలాగని నేను చేసింది సరైందని
వాదించకుండా తప్పును ఒప్పుకుని... చిన్నవాళ్లనైనా క్షమించమని అడగడం గొప్ప గుణం.
కాని కొందరిలో పశ్చాత్తాపం కనపడదు. జరిగిన దానిలో నా ప్రమేయం లేదని వాదిస్తారు. ఆ తప్పును ఇతరుల మీదకు నెడతారు. పొరపాటును ఒప్పుకోరు. తప్పు దిద్దుకోలేనప్పుడు కనీసం పశ్చాత్తాపం చెందడం మంచి లక్షణం అని అంటారు.
పెద్దలంటే గౌరవం, వినియ విధేయతలు ప్రదర్శించడం మంచి తనానికి నిదర్శనం. సహనాన్ని మించిన గొప్పగుణం లేదంటారు. ఓర్పుతో కష్టాలు, సమస్యలను ఎదుర్కో వాలి. నేను ఎక్కువ, మరొకరు తక్కువ అనే ఆలోచనను పూర్తిగా వదిలేయాలి. అందరూ సమానమేనని భావనకు రావాలి. ధనం. ..అధికారం... లాంటి వాటిని కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి తోటివారికి విలువ ఇవ్వాలి.
న్యాయస్థానా లు, పోలీస్ స్టేషన్ల కన్నా ప్రతి ఒక్కరు... వారి మనసు చెప్పే న్యాయానికి కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి అలవాట్లను కలిగి ఉంటే మనస్పర్దలు, గొడవలు రావని చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు.
