విమాన టికెట్ల రిఫండ్కు కొత్త రూల్స్..14 రోజుల్లోపే డబ్బు వాపస్

విమాన టికెట్ల రిఫండ్కు కొత్త రూల్స్..14 రోజుల్లోపే డబ్బు వాపస్

న్యూఢిల్లీ:  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు  ప్రయాణికులకు వేగంగా రిఫండ్స్ ఇచ్చేందుకు    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)  కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చింది. టికెట్ రద్దు చేసినప్పటి నుంచి 14 వర్కింగ్ డేస్‌‌లో రిఫండ్ ప్రాసెస్  పూర్తవ్వాలి. ట్రా వెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసినా రిఫండ్ బాధ్యత ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే. అంతేకాకుండా  ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు అదనపు చార్జీలు లేకుండా రద్దు లేదా మార్పు చేసుకోవచ్చు. 

టికెట్ ధరలో మార్పు ఉంటే అది మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.  అయితే, డొమెస్టిక్ విమానం  బయలుదేరే తేదీ నుంచి  7 రోజుల్లోపు లేదా ఇంటర్నేషనల్ విమానానికి  15 రోజుల్లోపు ఉంటే ఈ సౌకర్యం వర్తించదు. టికెట్ బుక్ చేసిన 24 గంటల్లోపు  పేరు సరిచేసుకుంటే చార్జీలు ఉండవు. సంక్షోభం తర్వాత రిఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంలో ఇండిగో చాలా ఆలస్యం చేసింది. దీంతో డీజీసీఏ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.