హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) దేశంలోనే ఆదర్శ విద్యా సంస్థగా ఎదగాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆకాంక్షించారు. మంగళవారం మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న పోలీస్ స్కూల్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.
అనంతరం స్కూల్ సొసైటీ కమిటీ సమావేశంలో ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం అధ్యక్షురాలు లలితా ఆనంద్, కమిటీ సభ్యులతో కలిసి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్కూల్ అభివృద్ధికి ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం కూడా సహకారం అందించాలని నిర్ణయించారు.
.విద్యార్థుల్లో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, గతేడాది 125 మంది విద్యార్థులతో ప్రారంభమైన వైఐపీఎస్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి వరకు 345 మంది విద్యార్థులు చదువుతున్నారు. సమావేశంలో డీజీలు మహేశ్ భగవత్, అనిల్ కుమార్‌తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
