తెలంగాణలో రోజుకు రూ.4 కోట్ల సైబర్ ఫ్రాడ్..అత్యాశతోనే చాలామందికి నష్టం

తెలంగాణలో రోజుకు రూ.4 కోట్ల సైబర్ ఫ్రాడ్..అత్యాశతోనే చాలామందికి నష్టం

భారతదేశంలో 30 శాతం సైబర్ నేరాలు పెరిగితే  తెలంగాణలో తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సమాజంలో ప్రమాదకరంగా ఉన్న నేరం సైబర్ క్రైమ్  అని చెప్పారు. 10 ,12 ఏళ్ల కిందట కూడా బందిపోట్లు, డెకాయిటి , దొంగతనాలు పెద్ద నేరాలుగా ఉండేవని.. గత ఆరేళ్లుగా సైబర్ క్రైమ్ పెద్ద పీడగా మారిందన్నారు.  

ఒక్క సెల్ ఫోన్ తో  ఇంట్లో కూర్చొని డబ్బు కాజేస్తున్నారని చెప్పారు. క్షణాల్లో డబ్బు మొత్తం మాయం చేస్తున్నారని తెలిపారు. అత్యాశతోనే చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని చెప్పారు.  మన అప్రమత్తతే  మనల్ని కాపాడుతుందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 

 తెలంగాణలో బాధితులు  రోజుకు రూ. 4 కోట్ల రూపాయలు సైబర్ మోసాల ద్వారా కోల్పోతున్నారని టీజీ సీఎస్ బీ డైరెక్టర్ - శిఖాగోయల్ తెలిపారు. ఇప్పటి వరకు సైబర్ గాళ్ళు కాజేసిన  రూ.350 కోట్ల  రూపాయలను బాధితులకు రీఫండ్ చేశామని చెప్పారు. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ  తెలంగాణలో సెప్టెంబర్ వరకు 8 శాతం తగ్గాయన్నారు.

 వచ్చే 6 వారల పాటు రాష్ట్రవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్రాడ్ కా ఫుల్ స్టా్ప్   పేరుతో అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు శిఖాగోయల్.  ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాలపై ప్రతి ఒకరికి లైఫ్ లాంగ్  అవగాహన రావాలన్నారు.