
కరీంనగర్ క్రైం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కానిస్టేబుల్ నుంచి పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భం ఆయన మాట్లాడుతూ… ప్రజల అకాంక్షలకు అనుగుణం పోలీసులు సేవలు అందించాలన్నారు. సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ఠ పెరుగుతుందని ఆయన అధికారులకు సూచించారు. యూనిఫాం సర్వీస్ డెలివరీ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన స్పందన, సేవలు ఉండాలని ఆయన అన్నారు. సరైన సేవలు అందిస్తే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం, నమ్మకం పెరుగుతాయని సూచించారు. అసెంబ్లీ, స్థానిక, జడ్పీటీసీ, ఎంపీటీసీ, లోక్ సభ ఎన్నికలు సమర్థంగాఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విధులు నిర్వహించారని అభినందించారు. రానున్న మున్సిపాల్ ఎన్నికలను కూడా పక్భందీగా నిర్వహించాలని అన్నారు. పోలీస్ స్టేషన్లలో 5ఎస్ సర్వీస్ ను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. పని విభజన ద్వారా ఒత్తిడి తగ్గి పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు. పోలీస్ స్టేషన్ స్థాయినుంచి నుండి కమిషనరేట్ వరకు ఫంక్షనల్ వర్టికల్స్ కు ప్రత్యేక అధికారులను కేటాయింటాలని అన్నారు. ఈ సందర్బంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని విభాగాల అధికారుల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రతి నెల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనన్నారు. ఇప్పటి వరకు కమిషనరేట్ లో 05 మోడల్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజీ ప్రమోద్ కుమార్, ఏడీసీపీలు రవిందర్, శ్రీనివాస్, ఏసీపీలు పాల్గొన్నారు.
తు.చ. తప్పకుండా పాటించాలె
సిరిసిల్ల టౌన్, వెలుగు : ప్రజలకు నిబంధనలు పెట్టే ముందు పోలీసులు కూడా వాటిని తూ.చ తప్పకుండా పాటించాలని ఎస్పీలకు రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలని డీజీపీ ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం పోలీసుల లక్ష్యాలపై డీజీపీ వివిధ స్థాయి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారన్నారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఈ స్థాయికి తీసుకురావడంలో తెలంగాణ రాష్ర్ట పోలీస్ అధికారుల సమష్టి కృషే కారణమన్నారు.