మరో వివాదంలో డీహెచ్ శ్రీనివాస్

మరో వివాదంలో డీహెచ్ శ్రీనివాస్

హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటళ్లలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సర్క్యులర్ జారీ చేశారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి పుట్టిన రోజున పండ్లు పంపిణీ చేయాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించడంపై పలువురు మండిపడుతున్నారు. గతంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ బర్త్ డేలో పాల్గొనలేదని నలుగురు అధికారులకు కమీషనర్ మోమో ఇచ్చారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలని నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం కూడా అప్పట్లో వివాదస్పదమైంది.