యశ్ 'టాక్సిక్'కే షాక్ ఇచ్చిన 'హనుమాన్ అంశ్'.. బాక్సాఫీస్‌పై భక్తి తుఫాన్!

యశ్ 'టాక్సిక్'కే షాక్ ఇచ్చిన 'హనుమాన్ అంశ్'.. బాక్సాఫీస్‌పై భక్తి తుఫాన్!

బాక్సాఫీస్ అంటే స్టార్ హీరో.. భారీ బడ్జెట్.. గ్రాండ్ ప్రమోషన్స్.. ఓపెనింగ్ డే రికార్డులు. కానీ కథలో దమ్ముంటే చాలు.. ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేయవచ్చు అని నిరూపిస్తోంది ఓ చిన్న సినిమా. అదే 'హనుమాన్ అంశ్' . ఈ మూవీ విడుదలైనప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ రికార్డులు సృష్టిస్తోంది..

బాక్సాఫీస్ రికార్డులు.. 

కేవలం రూ.1.8-2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఆధ్యాత్మిక చిత్రం 'హనుమాన్ అంశ్' థియేటర్లలో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి 2026లోనే బిగ్గెస్ట్ స్లీపర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తొలి వారంలో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ కేవలం రూ.90 లక్షలు మాత్రమే.  రెండో వారానికి థియేటర్ల సంఖ్య దాదాపు 250 నుంచి కేవలం 40కి పడిపోయాయి. అక్కడితో సినిమా కథ ముగిసిపోయిందని ట్రేడ్ వర్గాలు భావించాయి. 

రూ. 100 కోట్ల క్లబ్ వైపు..

ఇక ఈ సినిమా కథ ముగిసిపోయిందనుకున్న వేళ ఊహించని అద్భుతం జరిగింది. ప్రేక్షకులలో వ్యాపించిన పాజిటివ్ టాక్, సోషల్ మీడియా ట్రెండ్స్‌తో వసూళ్లు అమాంతం పుంజుకున్నాయి. 40 స్క్రీన్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ పెరగడం మొదలైంది. ఒక్కో థియేటర్‌కు వస్తున్న వసూళ్లు దాదాపు మూడు రెట్లు పెరగడంతో డిస్ట్రిబ్యూటర్లు అసలు లెక్క మార్చేశారు. మూడో వారంలో సినిమా ఏకంగా రూ.10.5 కోట్ల వరకు రాబట్టింది. నాలుగో వారం వచ్చేసరికి ఏకంగా రూ.50 కోట్ల మార్కును దాటేసి రూ.100 కోట్ల వైపు దూసుకెళ్తున్నాయి.

►ALSO READ | దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్' తెలుగు రిలీజ్‌కు బ్రేక్... చివరి నిమిషంలో ఎందుకు ఆపేశారంటే?

'టాక్సిక్' కు మించి వసూళ్లు..

 ఒకప్పుడు థియేటర్లు దొరకని ఈ సినిమా.. ఇప్పుడు 2,000కి పైగా స్క్రీన్లలో సందడి చేస్తోంది. అంతే కాదు .. సెప్టెంబర్ 1న 26వ రోజున 'హనుమాన్ అంశ్' ఏకంగా రూ.8.07 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'టాక్సిక్' ఏడో రోజున అన్ని భాషల్లో కలిపి రూ.6.90 కోట్లు మాత్రమే సాధించింది. అంటే నాలుగో వారంలో ఉన్న చిన్న సినిమా.. ఓ పెద్ద స్టార్ మూవీ మొదటి వారపు వసూళ్లనే దాటేసి రికార్డు సృష్టించింది. మరో వైపు థియేటర్ యాజమానులు సైతం 'టాక్సిక్' షోలనున తగ్గించి  'హనుమాన్ అంశ్ ' కు కేటాయిస్తున్నారు.

ఫుల్ జోష్‌లో మేకర్స్..

ఈ చిత్రాన్ని నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా విజయానికి అసలు కారణం వర్డ్ ఆఫ్ మౌత్. ఒకరు చూసి మరొకరికి చెప్పడం.. వాళ్లు కుటుంబంతో కలిసి థియేటర్‌కు రావడం.. ఇలా సినిమా ఒక్కో ప్రేక్షకుడి ద్వారా ఒక్కో మార్కెట్‌లో విస్తరించింది.  ఇక ఈ విజయంతో మేకర్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. దర్శకుడు విశాల్ చతుర్వేది ఇప్పటికే సీక్వెల్‌పై పని మొదలైందని ప్రకటించారు.