మా జాబ్​లను రెగ్యులర్ చేయండి: మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా

మా జాబ్​లను రెగ్యులర్ చేయండి: మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా

ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో మత్స్య అభివృద్ధిలో ప్రధాన పోత్ర పోషించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్​ మాట్లాడుతూ దేశంలోనే అనేక రాష్ట్రాలకు తెలంగాణ నుంచి చేపలను ఎగుమతి చేసే విధంగా చేయడంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. 

ఫీల్డ్​లో  బాధ్యతగా విధులను నిర్వహిస్తూ  రాష్ట్రవ్యాప్తంగా 1,100 నుంచి 4,000 మంది మత్స్య రైతులను చేయడంలో తమ పాత్ర ఎంతో ఉందన్నారు. సీఎం కేసీఆర్ తమ సేవలను దృష్టిలో పెట్టుకొని మత్స్య శాఖ కాంట్రాక్ట్  ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ ధర్నాలో కాంటాక్ట్ ఉద్యోగులు పూర్ణచందర్, శ్రీ చైతన్య, భవ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.