
హైదరాబాద్ వనస్థలిపురంలోని మాంగళ్య షాపింగ్ మాల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మాల్ లో పని చేసే ఎంప్లాయిస్… జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని,జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ షాపింగ్ మాల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తమకు సకాలంలో జీతాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు మహిళా ఉద్యోగులు.