IND vs SA: సెంచరీతో జురెల్ ఒంటరి పోరాటం.. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఛాన్స్!

IND vs SA: సెంచరీతో జురెల్ ఒంటరి పోరాటం.. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఛాన్స్!

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ ప్రస్తుతం సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నారు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసి సత్తా చాటిన ఈ వికెట్ కీపర్.. గురువారం (నవంబర్ 6) సౌతాఫ్రికా-ఏ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో దుమ్ములేపాడు. జట్టు మొత్తం విఫలమైనా ఒక్కడే సెంచరీతో పోరాడి జట్టును ఆదుకున్నాడు. 175 బంతుల్లో 132 పరుగులు చేసి జట్టు మొత్తం స్కోర్ లో సగం పరుగులు చేశాడు. జురెల్ ఇన్నింగ్స్ తో తొలి ఇన్నింగ్స్ లో ఇండియా-ఏ 255 పరుగులకు ఆలౌటైంది. జురెల్ సెంచరీతో భారత ప్లేయింగ్ 11 లో చోటు దాదాపు కన్ఫర్మ్ అయింది.

సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరగబోయే తొలి టెస్టులో వికెట్ కీపర్ గా కాకుండా స్పెషలిస్ట్ బ్యాటర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు పంత్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో జురెల్ తుది జట్టులో స్థానం సంపాదించి తనను తాను నిరూపించుకున్నాడు. పంత్ గాయం ఉంచి కోలుకొని సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు ఎంపిక కావడంతో జురెల్ మరోసారి బెంచ్ కు పరిమితమనుకున్నారు. అయితే సూపర్ ఫామ్ లో ఉండడంతో జురెల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మరో టీమిండియా యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా–ఎతో గురువారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిలైంది. ధ్రువ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (132 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సెంచరీతో చెలరేగినా.. మిగతా బ్యాటర్లు నిరాశపర్చడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. దీంతో టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 77.1 ఓవర్లలో 255 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఆరంభం నుంచి సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. టియాన్ వాన్ వురెన్ (4/52), షెపో మోరెకి (2/52), ప్రేనేలన్ సుబ్రాయెన్ (2/73) వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇండియా స్కోరు బోర్డును అడ్డుకున్నారు.

ఓపెనర్లు కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19), అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0), సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17), దేవదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5), కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24) నిరాశపర్చారు. 86/5తో కష్టాల్లో పడిన ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జురెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీతో నిలబెట్టాడు. కానీ రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతనికి సరైన సహకారం దక్కలేదు. హర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే (14), ఆకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) ఫెయిలయ్యారు. ఈ దశలో కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (20) మెల్లగా ఆడి ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 79 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించడంతో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్త కోలుకుంది. కానీ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటైన తర్వాత సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (15), ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ (0) వెంటవెంటనే వెనుదిరగడంతో ఇండియా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 221 పరుగులకు ఆలౌటైంది.