ప్యాన్ ఇండియా స్థాయిలో ఆకర్షించాలని ఆశపడుతున్న ధృవ్ సర్జా

ప్యాన్ ఇండియా స్థాయిలో ఆకర్షించాలని ఆశపడుతున్న ధృవ్ సర్జా

కన్నడ హీరోలంతా తెలుగునాట కూడా సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ధృవ్ సర్జా కూడా వారిలో ఉన్నాడు. ఈసారి తెలుగులోనే కాదు, ప్యాన్ ఇండియా స్థాయిలో ఆకర్షించాలని ఆశపడుతున్నాడు. ప్రేమ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో అతడు నటిస్తున్న చిత్రానికి ‘కేడీ’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఫిక్స్ చేశారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా బెంగళూరులో టైటిల్‌‌‌‌‌‌‌‌ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. ‘రామాయణ యుద్ధం స్త్రీ కోసం. మహాభారత యుద్ధం రాజ్యం కోసం. ఈ కలియుగ యుద్ధం.. కేవలం రక్తం కోసం’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌తో మొదలైన ఈ యాక్షన్ ప్యాక్డ్ వీడియోలో చాలా అగ్రెసివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు ధృవ్‌‌‌‌‌‌‌‌.

కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌. ‘కేజీయఫ్ తర్వాత ఇందులో చేస్తున్నాను. త్వరలో మరిన్ని సౌత్ సినిమాలు చేస్తానని అనిపిస్తోంది’ అంటున్నారు సంజయ్. ఇది తనకి ఆరో సినిమా అని, ఆరు తన లక్కీ నంబర్ అని చెబుతున్నాడు ధృవ్. డెబ్భైల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, మోహన్‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌ స్పెషల్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నారని సమాచారం.