సిద్దిపేట జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలకు ధూళిమిట్ట విద్యార్థులు

సిద్దిపేట జిల్లాలో  రాష్ట్రస్థాయి పోటీలకు ధూళిమిట్ట విద్యార్థులు

చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లాలో ఇటీవల నిర్వహించిన సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ కం సెలెక్షన్‌లో జడ్పీహెచ్ఎస్ ధూళిమిట్ట పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చారు. సోమవారం పాఠశాలలో ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల హెచ్ఎం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సబ్​జూనియర్​సాఫ్ట్​బాలు టోర్నమెంట్ లో ధూళిమిట్ట పాఠశాల బాలుర జట్టు ప్రథమ స్థానం, బాలికల జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు.

 ఈనెల 24 నుంచి 29 వరకు మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో నిర్వహించనున్న 10వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సాఫ్ట్‌ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ధూళిమిట్ట పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు వివరించారు. బాలుర విభాగంలో వశీకర్, శ్రీరామ్ సాత్విక్, రిత్విక్, కార్తీక్, సాత్విక్, రాహుల్, సంజయ్ ఎంపిక కాగా, బాలికల విభాగంలో రాధిక, శృతి, సంజన, ప్రణతి, హర్షిని ఎంపికయ్యారు.