సహకార సంఘాలకు సోలార్ ప్లాంట్లు

 సహకార సంఘాలకు సోలార్ ప్లాంట్లు
  • పెద్దపల్లి జిల్లాలో నాబార్డు ద్వారా సహకార సంఘాలకు సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు మంజూరు
  • సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు  హైడల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తికి ఏర్పాట్లు
  • జెన్​కో ద్వారా ఇప్పటికే హైడల్ 9.16 మెగావాట్లు, సోలార్​ 4.6 మెగావాట్లు ఉత్పత్తి
  • రూరల్​ ఏరియాల్లో  ప్రారంభానికి మరికొన్ని సిద్ధం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పునరుత్పాదక కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి స్పీడందుకుంది. గతేడాది నుంచి ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో సోలార్​ప్లాంట్​యూనిట్ల ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జెన్​కో  డీ 83 కాలువ ద్వారా 9.16 మెగావాట్ల హైడల్ పవర్ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా వ్యవసాయ సహకార సంఘాలకు సోలార్​పవర్​ప్లాంట్లను మంజూరు చేస్తున్నారు. నాబార్డు సహకారంతో ఒక మెగావాట్​కెపాసిటీతో ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నారు. ఇక్కడ ఉత్పత్తయిన పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో కొనుగోలు చేయనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు వదిలే ఆరునెలల కాలంలో హైడల్ పవర్​ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

వడ్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తికి రెడీగా సోలార్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ 

ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో జెన్​కో ద్వారా 4.6 మెగావాట్ల సోలార్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి జరుగుతోంది. జూలపల్లి మండలం వడ్కాపూర్​వద్ద 2.2 మెగావాట్లతో నిర్మించిన సోలార్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. దీంతోపాటు తుర్కల మద్దికుంట, కమ్మర్​ఖాన్​పేట, అబ్బాపూర్​ వద్ద సోలార్​ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ సహకార సంఘాలకు కేటాయిస్తున్న సోలార్​పవర్​ ప్లాంట్ల నిర్మాణానికి పూర్తిగా నాబార్డు సహకారం అందిస్తోంది. 

ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి రూ. 3.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిర్మాణ ఖర్చులో 10 శాతం సొసైటీ భరించనుండగా... మిగతాది నాబార్డు ద్వారా అతి తక్కువ వడ్డీకి లోన్‌‌‌‌‌‌‌‌ సదుపాయం ఉంది. ఒక మెగావాట్​ కెపాసిటీతో ఈ ప్లాంటు నిర్మాణం జరుగనుంది. ఉత్పత్తయిన పవర్​ను ట్రాన్స్​కో కొనుగోలు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఆర్థిక వనరులు, నిర్వహణ సామర్థ్యం ఉన్న సంఘాలను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలోని మంథని, కాల్వ శ్రీరాంపూర్, అప్పన్నపేట, నంది మేడారం గ్రామాల్లోని సహకార సంఘాలకు సోలార్ ప్లాంట్లు మంజూరు చేయనున్నారు. 

ఇప్పటికే జిల్లాలో నాలుగు సోలార్ ప్లాంట్లు 

పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నాలుగు సోలార్​ ప్లాంట్లు విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నాయి. వాటి ద్వారా దాదాపు 150 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నట్లు సమాచారం. రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీలో  గ్రౌండ్​ సోలార్​ ప్లాంటు ద్వారా 10 మెగావాట్లు, వాటర్​ ప్లోటింగ్​ప్లాంటు ద్వారా 100 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు.

మంథని, కాల్వశ్రీరాంపూర్​ మండలాల్లోని ప్లాంట్ల ద్వారా మరో 40 మెగావాట్లు విద్యుత్​ఉత్పత్తి అవుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా సేకరించిన భూములు కావడంతో రైతుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈక్రమంలో ప్రభుత్వ భూములను గుర్తించి మహిళల నేతృత్వంలో కనీసం 1000 మెగావాట్ల సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యుత్​ ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లుసమాచారం.