పార్థ గోపాల్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. మేఘన హీరోయిన్. సూర్య జి యాదవ్ దర్శకుడు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. తాజాగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌ను చూసి మూవీ టీమ్‌ను అభినందించారు.
ఈ ప్రత్యేక సందర్భంలో మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ఈ సినిమా ప్రదర్శించనున్నట్లు, మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి ఈ చిత్రం చూడాలని హీరో, నిర్మాత పార్థ గోపాల్ అన్నాడు. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని, ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అందుకే ఈ ఆఫర్‌ను ప్రకటించామని చెప్పాడు.
