పొలంలో మహిళా రైతుకు వజ్రం దొరికింది

పొలంలో మహిళా రైతుకు వజ్రం దొరికింది

ఆరుగాలం కష్టపడి రైతన్న పంటలు పండిస్తాడు. మట్టినే నమ్ముకుంటాడు.. మట్టితోనే జీవనం చేస్తాడు. అలాంటి రైతుకు.. మట్టిలోనే మాణిక్యాలు దొరికితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి ఘటనే కర్నూల్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని తుగ్గలి వజ్రాలకు ప్రసిద్ధి. అక్కడి భూముల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. దాంతో అక్కడి ప్రజలు అదే పనిగా వజ్రాల కోసం వెతుకుతుంటారు. మండలంలోని పగిడిరాయి గ్రామానికి చెందిన ఓ మహిళ పొలం పనులు చేస్తుండగా 4 క్యారెట్ల వజ్రం దొరికింది. దాంతో ఆ మహిళ ఎగిరిగంతేసింది. ఆ వజ్రాన్ని గుత్తిలోని ఒక నగలవ్యాపారికి చూపించింది. దాన్ని చూసిన వ్యాపారి.. ఆ వజ్రానికి రూ. 3.5 లక్షలు చెల్లిస్తానన్నాడు. వెంటనే ఆ మహిళ వజ్రాన్ని ఆ వ్యాపారికి ఇచ్చి.. నగదు తీసుకొని వెళ్లింది. ఇలా వజ్రాలు దొరకడం ఆ ప్రాంతంలో కొత్తేమీ కాదు అయితే గత నాలుగు నెలల కాలంలో ముగ్గురికి వజ్రాలు మాత్రం విశేషం.

For More News..

వాయుసేనలో చేరిన రఫేల్ యుద్ధవిమానాలు

రాష్ట్రంలో మరో 2,534 కరోనా కేసులు

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది