Viral Video: ముఖేష్ అంబానీ ప్లేట్లలోని లడ్డూలు తీసుకెళ్లారా? ఎడిటెడ్ వీడియో వైరల్

Viral Video:  ముఖేష్ అంబానీ ప్లేట్లలోని లడ్డూలు తీసుకెళ్లారా? ఎడిటెడ్ వీడియో వైరల్

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్ నుంచి అనేక వీడియోలు ఇటీవల ఆన్ లైన్ లో చక్కర్లుకొడుతున్నాయి. అయితే ఈ వీడియోను కొందరు కాపీ చేసి దానిని మాడిఫై చేసి ఇంటర్నెట్ లో పెట్టారు. ఈ వీడియోలో సరిగ్గా గమనిస్తే ముఖేష్ అంబానీ అతిథులకు వడ్డించడం, వారికి లడ్డూలు అందజేస్తున్నట్లుగా కాకుండా.. వారి ప్లేట్లనుంచి డిష్ లోకి లడ్డూలు తీసుకుంటున్నట్లు చూపిస్తుంది.ఈ వీడియో నిజంగా ఒరిజనలే అన్నట్లు ఉంది.. ఇది చూస్తూ మీరు నిజంగా ఆశ్చర్యపోవచ్చు. కానీ అంబానీ ఎందుకు అలా చేస్తారు.. ఈ వీడియోతోపాటు ఖానా కమ్ పడ్ గయా హై తో థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఆహారం తగినంతగా సిద్దం కాలేదు.. కొద్దిగా సర్దుబాటు చేసుకోండి) అని రాశాడు. ఇది ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. 

అసలు వీడియో 
జామ్ నగర్ లో స్థానికులకు ఇచ్చిన విందులో బిలియనీర్ అంబానీ ప్రజలకు స్వయంగా ఆహారం, లడ్డూలు వడ్డిస్తున్నట్లు వీడియోలో చూపించింది. వారికి చిరునవ్వుతో మనస్ఫూర్తిగా భోజనం వడ్డిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరు ముఖేష్ అంబానీకి దండం పెడుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉంది. 

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా హాజరయ్యారు. సంప్రదాయ జైపూర్ కళల ప్రత్యక్ష ప్రదర్శనల నుంచి రిహన్న వంటి ప్రపంచ కళాకారుల ప్రదర్శనల వరకు ఈ వేడుక మూడు రోజుల పాటు నిర్వహించారు.మార్చి 3 న ముగిసింది.   అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ 2024 జూలైలో వివాహం చేసుకోనున్నారు. 

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్ నుంచి అనేక వీడియోలు ఇటీవల ఆన్ లైన్ లో చక్కర్లుకొడుతున్నాయి. అయితే ఈ వీడియోను కొందరు కాపీ చేసి దానిని మాడిఫై చేసి ఇంటర్నెట్ లో పెట్టారు. ఈ వీడియోలో సరిగ్గా గమనిస్తే ముఖేష్ అంబానీ అతిథులకు వడ్డించడం, వారికి లడ్డూలు అందజేస్తున్నట్లుగా కాకుండా.. వారి ప్లేట్లనుంచి డిష్ లోకి లడ్డూలు తీసుకుంటున్నట్లు చూపిస్తుంది.