కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉంటేనే నెగ్గుకొస్తారు

కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉంటేనే నెగ్గుకొస్తారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌‌‌లో భిన్న రకాల అభిప్రాయాలకు ఎప్పుడూ ఆస్కారం ఉంటుందని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో పెను మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న సీనియర్ నాయకులతో కూడిన జీ23పై రాహుల్ తొలిసారి స్పందించారు.  విభిన్న అభిప్రాయాలకు కాంగ్రెస్‌‌లో చోటు ఉందని, అలాంటి వ్యూస్ కలిగిన వ్యక్తులే పార్టీలో నెగ్గుకురాగలరని తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్‌తో జరిగిన సంభాషణలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీలో 20 మంది నేతలు ఉంటే ఆ ఇరవై మంది భిన్న రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. బీజేపీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ లేదా ఏ ఇతర పార్టీలోనూ ఇలాంటి అభిప్రాయాలకు చోటు ఉండదు. మా పార్టీలు ఎవరు ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నా మేం స్వాగతిస్తాం’ అని రాహుల్ పేర్కొన్నారు.