ఢిల్లీ చలో మార్చ్ రెండు రోజులు వాయిదా

ఢిల్లీ చలో మార్చ్ రెండు రోజులు వాయిదా

పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో యువ రైతు మృతిచెందాడు.ఢిల్లీవైపు పాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకు నేందుకు హర్యానా భద్రతా సిబ్బంది బాష్ప వాయువు షెల్స్ ను ప్రయోగించడంతో 22 ఏళ్ల పంజాబ్ రైతు తలకు గాయమై మృతిచెందాడు. దీంతో రైతులు ఢిల్లీ ఛలో మార్చ ను రెండు రోజుల పాటువాయిదా వేశారు. తదుపరి కార్యచరణపై చర్చించేందుకు రైతులు సమావేశం కానున్నారు. 

ఖనౌరీ, శంభు సరిహద్దు క్రాసింగ్ వద్ద హర్యానా పోలీసులు రైతుల మార్చ్ అడ్డుకునేందుకు భాష్ప వాయువు షెల్స్ ప్రయోగించడంతో మొత్తం 26 మంది రైతులు గాయాపడ్డారని పంజాబ్ అధికారులు తెలిపారు. 

బటిండా జిల్లాలోని బల్లోహ్ గ్రామానికి చెందిన శుభకరణ్ సింగ్ అనే యువకుడు తలకు గాయమైన మరణించిన తర్వాత రైతుల నిరసనల్లో మొదిటి బాధితుడు అయ్యాడు. అతను పాటియాలాలోని రాజేంద్రా ఆస్పత్రిలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. శుభకరన్ సింగ్ రబ్బరు బుల్లెట్ తగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పాటియాలా రేంజ్ డిఐజీ తెలిపారు.

ఆందోళనకారులు పొట్టుకు నిప్పంటించుకొని పొగ పెట్టేందుకు ప్రయత్నించారని.. భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్  షెల్స్ , రబ్బరు బుల్లెట్లను కాల్చారని ప్రాథమిక సమాచారం తెలిసిందని డిఐజీ అన్నారు.