మెయిన్‌పురి ఎస్పీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్

మెయిన్‌పురి ఎస్పీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి ఆయన కోడలు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్ధానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. మెయిన్‌పురి నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996 నుంచి ఎస్పీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తు్ంది. డిసెంబరు 5న ఈ ఉపఎన్నిక జరగనుండగా 8న ఫలితాలు వెలువడనున్నాయి. 

2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ వచ్చిన 44 ఏళ్ల డింపుల్ యాదవ్‌...  ఆ ఎన్నికల్లో ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ తరువాత 2012లో కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె ఏకపక్షంగా గెలిచారు. ఇక 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్నౌజ్ నుండి పోటీ చేసి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయగా బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో 10 వేల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.