ఇండియా వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ తండ్రి అయ్యాడు. కార్తీక్ భార్య, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్.. ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గురువారం ప్రకటించిన డీకే.. పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించాడు.

