
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్ ‘కిల్లర్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనే లీడ్ రోల్ చేస్తున్నాడు. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. చేతిలో రివాల్వర్‌తో కనిపిస్తున్న పూర్వాజ్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం సంగీతం అందిస్తున్నారు.