మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు.. కానీ, మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి: ఆర్జీవీ

మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు.. కానీ, మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి: ఆర్జీవీ

నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ, మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయని ఆర్జీవీ అన్నారు. 

‘‘కోట శ్రీనివాసరావు నిస్సందేహంగా సినిమా చూసిన గొప్ప నటులలో ఒకరు. నా శివ సినిమాకు ఆయన చేసిన కృషిప్రభావం అపారం. అలాగే, నా సినిమాలైనా గాయం, డబ్బు, సర్కార్ మరియు రక్తచరిత్ర.. ఇవన్నీ ఎవర్ గ్రీన్. కోటశ్రీనివాసరావు గారు, మీరు వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయని’’డైరెక్టర్ ఆర్జీవీ Xలో పోస్ట్ పెట్టాడు.

ఇకపోతే.. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన అనేక సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. వాటిలో శివ (1989), గాయం (1993),మనీ (1993),గోవిందా గోవిందా (1994),అనగనగా ఒక రోజు (1995),సర్కార్ (2005), రక్త చరిత్ర (2010) వంటి తదితర సినిమాలకు పనిచేశాడు.

గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు (జులై 13న) తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1978 ప్రాణం ఖరీదు సినిమాతో సీనీ ఎంట్రీ ఇచ్చిన కోట.. దాదాపు 750 సినీమాలకు పైగా నటించారు.