కలియుగంలో జరిగేది చూపించాం

కలియుగంలో జరిగేది చూపించాం

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో  కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌‌‌‌‌‌‌  నిర్మించిన  చిత్రం ‘కలియుగం పట్టణంలో’. మార్చి 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ ‘కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారు అనేది కథ.  ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి చూపిస్తాం. నల్లమల ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కథ సాగుతుంటుంది.  

సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మదర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. అలాగే  లవ్, యాక్షన్, ఒక మెసేజ్ కూడా ఉంటుంది. బయట చాలామంది తండ్రులు సోషియో ఫోబియాతో ఉన్నారు. నా కొడుకు ఇలా ఉండాలి, ఇది చేయాలి, సమాజం ఏం అంటుందో అని ఆలోచిస్తారు. పిల్లల ఫీలింగ్స్ పట్టించుకోరు. వాటికి తగ్గట్టు రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లో జరిగేవి  చూపించాం. ఇందులోని ఇంటెన్స్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విశ్వకార్తికేయ బాగా చేశాడు.  గత సినిమాల్లో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌గా కనిపించిన విశ్వ పాత్ర  వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. 

ఈ సినిమా  తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక మార్క్‌‌‌‌‌‌‌‌గా నిలిచిపోతుంది. ఈ సినిమా తర్వాత కలియుగం కార్తికేయ అని పిలుస్తారు. అలాగే హీరోయిన్ ఆయుషి పటేల్ గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కీ రోల్ ప్లే చేసింది. చిత్రశుక్లా పోలీస్ పాత్రలో కనిపిస్తుంది. అజయ్ అరసాడ మంచి మ్యూజిక్‌‌‌‌‌‌‌‌తో పాటు బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు అందించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఇక దీనికి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా ‘కలియుగ నగరంలో’ మూవీ తీస్తున్నా’ అని చెప్పాడు.