
తమిళ సినిమా చరిత్రలో అత్యంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరు ఎస్ శంకర్(S Shankar). ఇవాళ (ఆగస్టు17న) తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. అసలు పాన్-ఇండియా ఏంటనేది తెలియని టైంలోనే..పాన్-ఇండియా విజయాన్ని సాధించిన ఆల్-టైమ్ హిట్ డైరెక్టర్ ఎస్.శంకర్.
తన బర్త్ డే స్పెషల్ గా గేమ్ ఛేంజర్(Game Changer) టీమ్ బేగంపేటలో వేసిన స్పెషల్ సెట్స్‌లో ఎస్ శంకర్ పుట్టినరోజును వేడుకను జరుపుకుంది. ఈ బర్త్ డే ఈవెంట్ కు సంబంధించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ఈవెంట్ లో హీరో రామ్‌చరణ్(Ram Charan)తో పాటు నిర్మాత దిల్‌రాజు (Dil Raju) పాల్గొన్నారు. డైరెక్టర్ శంకర్‌కు రామ్‌చరణ్ కేక్ తినిపిస్తోన్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇండస్ట్రీలో ప్రాంతీయ కథ చిత్రాలతో వస్తున్న టైంలోనే..ప్రపంచ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగించిన ఫస్ట్ డైరెక్టర్ శంకర్. అతను తన మూవీస్ తో..ఆడియన్స్ ను ఆలోచింప చేసేవారు. సొసైటీకి సంబందించిన స్టోరీస్ ను తెరకెక్కించడంలో శంకర్ టాలెంట్ చాలా గొప్పది అని చెప్పుకోవాలి. భారీ సెట్‌లు, అత్యాధునిక CGIతో తన మూవీస్ కు రిచ్ నెస్ తీసుకొచ్చారు.
ఇక గేమ్ ఛేంజర్ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఏడు అవతారాల్లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి ఐఏఎస్ రోల్ కాగా..మరొకటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే తండ్రీ పాత్ర అని ఇప్పటికే టాక్ ఉంది. ఇక మరిన్ని అవతారాల్లో కనిపించే చరణ్ నుంచి.. ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తుంది.ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రజెంట్ డైరెక్టర్ శంకర్ గేమ్‌ఛేంజర్ మూవీతో పాటు..కమల్ హాసన్(Kamal Hasan) ఇండియన్ 2(Indian 2) సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు.