మూడు భాగాలుగా ‘పుష్ప’

మూడు భాగాలుగా ‘పుష్ప’

ప్యాన్ ఇండియా రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘పుష్ప’రాజ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. అంతగా అంచనాలు లేని బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైతం కలెక్షన్ల వర్షం కురిపించిందీ చిత్రం. ఇప్పటికీ ‘తగ్గేదే లే’ అంటూ సెలెబ్రిటీలు సైతం అల్లు అర్జున్ మేనరిజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇమిటేట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇంత సంచలనం సృష్టించిన చిత్రానికి సీక్వెల్ వస్తోందంటే అంచనాలు మామూలుగా ఉండవు కదా. అందుకే ‘పుష్ప 2’ కోసం అప్పుడే ఎదురు చూపులు మొదలయ్యాయి. తాజాగా వచ్చిన ఓ వార్త వింటే బన్నీ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత సంతోషంతో ఊగిపోవడం ఖాయం. ఈ సినిమాకి ఒక సీక్వెల్ కాదు, రెండు సీక్వెల్స్ ఉండబోతున్నాయట. నిజానికి ఒక సినిమాగానే ‘పుష్ప’ని స్టార్ట్ చేశాడు సుకుమార్. కొంత తీసిన తర్వాత టూ పార్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలనే ఆలోచన వచ్చింది. ‘పుష్ప: ద రెయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో మొదటి భాగాన్ని తీసుకొచ్చాడు. సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ‘పుష్ప: ద రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పుడు మూడో భాగాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ దీనిపై చర్చలు జరుగుతున్నాయని, దాదాపు ప్లాన్ ఖరారైనట్టేనని సమాచారం. అంతే కాదు.. ఈ సినిమాలో సమంత కూడా యాక్ట్ చేయనున్నట్లు తెలిసింది. మొదటి పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటమ్ సాంగ్ చేసింది సామ్. సెకెండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని దిశా పటాని చేయనుందని అంటున్నారు. అయితే ‘రంగస్థలం’ నుంచి సమంతను సెంటిమెంటుగా ఫీలవుతున్న సుకుమార్.. ‘పుష్ప 2’లో ఓ చిన్న పాత్ర కోసం సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తీసుకోవాలని ఫిక్సయ్యాడట. నిజానికి ఆమె కోసమే ఆ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సృష్టించాడని కూడా అంటున్నారు. ఈ వార్తలు నిజమో కాదో తెలీదు కానీ.. సినిమాపై చెప్పలేనంత బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. మరి ‘పుష్ప’రాజ్ ప్లాన్స్ నిజంగానే మారాయా లేక ఇవన్నీ ప్రచారానికే పరిమితమా అనే విషయాన్ని సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎవరో ఒకరు కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేస్తారేమో చూడాలి.