
ఉద్యోగులు, పెన్షనర్లను బడ్జెట్ నిరాశపరిచింది. బడ్జెట్‌లో ఐఆర్, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం దారుణం. ఆర్థిక అంచనాలు వేయటంలో ప్రభుత్వం విఫలమైంది. విద్యారంగానికి సంబంధించి బడ్జెట్ అస్పష్టంగా ఉంది. విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీ అంశాన్ని అసలే ప్రస్తావించలేదు. ఆర్థిక మాంద్యం18 నెలల నుంచి ఉంది. ఇప్పుడు మాంద్యం పేరుతో రూ.35 వేల కోట్ల బడ్జెట్‌ను తగ్గించడంతో, ప్రభుత్వ ఆర్థిక డొల్లతనం బయటపడింది. రైతుబంధు కొనసాగిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటివరకూ తొలి విడతకు సంబంధించి 40% మంది రైతులకు డబ్బులు అందలేదు. ఈ బడ్జెట్ పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టమే తప్ప, లాభం లేదు. – ఎమ్మెల్సీ నర్సిరెడ్డి