- పారాచూట్ల సాయంతో బయటపడ్డ పైలట్లు
వాషింగ్టన్: అమెరికా ఎయిర్ షోలో అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు నేవీ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్లు సేఫ్గా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు పైలట్లు ఎజెక్ట్ అయి పారాచూట్ల సాయంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వాషింగ్టన్ స్టేట్ వెస్టర్న్ ఇడాహోలోని మౌంటెయిన్ హోం ఎయిర్ ఫోర్స్ లో ఈ ఘటన జరిగింది.
యూఎస్ నేవీకి చెందిన ఈఏ 18జీ గ్రోలర్స్ జెట్ విమానాలు ఈ ఎయిర్ షోలో పాల్గొన్నాయి. జెట్ విమానాలు ప్రదర్శన చేస్తుండగా.. అకస్మాత్తుగా ఢీకొన్నాయి. వెంటనే ఆ విమానాలు కూలిపోవడంతో ఘటనా స్థలంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు పైలట్లు సేఫ్గా ఉన్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. నలుగురు పైలట్లు ప్రాణాలతో బయటపడడం అద్భుతమన్నారు.
