
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణలపై దాఖలైన పలు రిట్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ డివిజన్ బెంచ్ ప్రకటించింది.
రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని పేర్కొంటూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభ్యర్థి కె.రవీంద్ర ప్రసాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థులు జావేద్‌ఖాన్, మద్దిరెడ్డి రవీందర్, జి.ఆంజనేయులు, ఎం.అనసూయ, కె.మురళీకృష్ణ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది.