తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

సుల్తానాబాద్, వెలుగు: తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ రైతు తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంపూర్ గ్రామానికి చెందిన గోస్కుల రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం గతంలో 20 గుంటల భూమి ఇచ్చింది.

ఇతని పక్కనే రాఘవరెడ్డి అనే రైతుకు భూమి ఉంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా బాట విషయంలో వివాదం ఉంది. తన భూమిని ఆక్రమించి రోడ్డు వేశారని రవీందర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సర్వే చేశారు.

ఈ సర్వేలోనూ తనకు అన్యాయం జరిగిందని గొడవ చేయడంతో రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తన సమస్య పరిష్కారం కావడం లేదని బుధవారం తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును నోట్లో, తలపై పోసుకున్నాడు.

వెంటనే అక్కడున్న సిబ్బంది అడ్డుకొని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ కు తీసుకువెళ్లారు. ఈ విషయమై తహసీల్దార్ బషీరుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వివరణ కోరగా, రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 గుంటల భూమిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదని విచారణలో తేలిందని అన్నారు. పాత నక్ష ప్రకారమే రోడ్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.