ఇవాళ (సెప్టెంబర్ 27) రసూల్ పురలో డబుల్ ఇండ్ల పంపిణీ.. హాజరు కానున్న మంత్రులు పొంగులేటి, పొన్నం

ఇవాళ (సెప్టెంబర్ 27) రసూల్ పురలో డబుల్ ఇండ్ల పంపిణీ.. హాజరు కానున్న మంత్రులు పొంగులేటి, పొన్నం

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్​పురలో శనివారం లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ 328 డబుల్​బెడ్ రూమ్​ఇండ్లు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే శ్రీగణేశ్​తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అధికారులతో కలిసి ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు. మంత్రులు, మేయర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

లబ్ధిదారుల వయసు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఫ్లోర్‎ల వారీగా ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. జీహెచ్ఎంసీ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీందర్, డీఈ సంధ్య, ఏఈ మహేశ్, ఎలక్ట్రికల్ డిపార్ట్​మెంట్ ఏడీఈ నాగరాజు, తహసీల్దార్​పాండు నాయక్, కంటోన్మెంట్ ఆఫీసర్​శశాంక్ తదితరులున్నారు.