
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కొత్త రేషన్ కార్డు కార్యక్రమంలో పోలీసులు పాల్గొనకుండా అడ్డుకోవడం హక్కులను హరించడమేనన్నారు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి.తెలంగాణలో రాచరిక నియంతృత్వ పాలన సాగుతోందనడానికి ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి..ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోందని తెలిపారు.
వేలాది పోలీసులు..TRS గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలను సమావేశానికి రాకుండా చెక్ పోస్ట్ లు పెట్టి అడ్డుకోవడంతో పాటు.. బైండోవర్లు చేశారని ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. ఒక ఎమ్మెల్యే అధికారికంగా చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ని TRS గుండాలు పోలీసుల సమక్షంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఎమ్మెల్యే హక్కులను మంత్రి దగ్గరుండి కాలరాస్తున్నారని..మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్తుంటే.. వేలాది మంది పోలీసులు, TRS గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారని విమర్శించారు. దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని అడగడం తప్పా.. అని ప్రశ్నించారు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయమంటే కేసులు పెట్టి వేధిస్తారా ? అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి దళితుల కోసమే మాట్లాడారు తప్పా.. మీ అవినీతి లో వాటా అడిగారా..అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులను ఇలాగే కేసులు పెట్టి వేధిస్తే..ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ప్రెస్ నోట్ ద్వారా డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అరాచకాలు మానుకోకపోతే.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.