నా ట్రావెల్‌ ఇన్ఫర్మేషన్‌ తప్పు

నా ట్రావెల్‌ ఇన్ఫర్మేషన్‌ తప్పు

మెల్‌‌‌‌బోర్న్‌‌: తాను ఆస్ట్రేలియాలో ఇచ్చిన ట్రావెల్‌‌ డిక్లరేషన్‌‌ ఫామ్‌‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌‌ తప్పని సెర్బియా టెన్నిస్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ అంగీకరించాడు. పబ్లిక్‌‌ హెల్త్‌‌ను దృష్టిలో పెట్టుకుని జొకోను రెండోసారి డిటెన్షన్‌‌లోకి తీసుకోవాలని ఆసీస్‌‌ గవర్నమెంట్‌‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్‌‌ గురించి జొకో పూర్తి స్పష్టత ఇవ్వడం లేదు. ‘వ్యాక్సిన్‌‌ ఎగ్జెంప్షన్‌‌’తో ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో ఆడేందుకు లాస్ట్‌‌ వీక్‌‌ జొకో.. మెల్‌‌బోర్న్‌‌ చేరుకున్నాడు. అయితే సరైన ప్రూఫ్స్‌‌ చూపెట్టకపోవడంతో ఆసీస్‌‌ బోర్డర్‌‌ అఫీషియల్స్‌‌ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కోర్టు ఆర్డర్స్‌‌తో అతన్ని రిలీజ్‌‌ చేయడంతో ఆసీస్‌‌లోనే ఉన్నాడు. 

‘జొకో.. మా నేషన్‌‌ పాండమిక్‌‌ క్వారంటైన్‌‌ రూల్స్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. అతను డబుల్‌‌ డోస్‌‌ వ్యాక్సిన్‌‌ తీసుకోలేదు. అందుకే కంట్రీ వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించాం. ఇది మా నిర్ణయం. కానీ కోర్టు మరోలా ఆలోచించింది. అయితే మెజారిటీ ఆస్ట్రేలియన్ల అభిప్రాయం వేరేలా ఉంది. టెన్నిస్‌‌ ప్లేయరో, స్పెయిన్‌‌ కింగో, ఇంగ్లండ్‌‌ క్వీనో.. ఇలా ప్రతి ఒక్కరు కొత్త రూల్స్‌‌తో వస్తే ఎలా డీల్‌‌ చేయాలి’ అని ఆసీస్‌‌ డిప్యూటీ ప్రైమ్​ మినిస్టర్‌‌ బార్నాబీ పేర్కొన్నారు.