జొకో, నడాల్.. ఫైనల్లోనే ఎదురుపడేది

జొకో, నడాల్.. ఫైనల్లోనే ఎదురుపడేది

మెల్​బోర్న్​: సీజన్​ తొలి గ్రాండ్​ స్లామ్​ ఆస్ట్రేలియన్​ ఓపెన్​ డ్రా గురువారం విడుదలైంది రెండు వేర్వేరు భాగాల్లోఉన్న లెజెండరీ ప్లేయర్లు రఫెల్​ నడాల్ (స్పెయిన్​)​, నొవాక్​ జొకోవిచ్ (సెర్బియా)​.. మెన్స్​ సింగిల్స్​ ఫైనల్లోనే ఎదురుపడే చాన్స్​ ఉంది. 9సార్లు ఈ టైటిల్​ నెగ్గిన జొకో.. గతేడాది వీసా ఇబ్బందుల వల్ల టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఈసారి నాలుగో సీడ్​గా బరిలోకి దిగుతున్న సెర్బియన్.. సోమవారం జరిగే తొలి రౌండ్​లో రొబెర్టో కార్బలెస్​ బేనా (స్పెయిన్​)తో తలపడనున్నాడు. మరో మ్యాచ్​లో టాప్​సీడ్​ నడాల్​.. 21వ ర్యాంకర్​ డార్పర్​ (బ్రిటన్​)ను ఎదుర్కొంటాడు.