హైదరాబాద్, వెలుగు: దివ్యాంగ వర్కింగ్ జర్నలిస్టులందరికీ మేనేజ్మెంట్ కోటాతో సంబంధం లేకుండా అక్రెడిటేషన్కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) కోరింది. సోమవారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా డీజేఎస్నేతలు మాట్లాడుతూ.. దివ్యాంగులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను ఆమోదించడంలో డీపీఆర్వోలు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు.
డెస్క్ జర్నలిస్టులకు అదనంగా అక్రెడిటేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను అమలు చేయడంలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. 15 ఏండ్ల ఎక్స్పీరియన్స్దాటిన డెస్క్జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ దివ్యాంగులైన వర్కింగ్జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. చైర్మన్ ను కలిసినవారిలో డీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేఎన్రాజారామ్, కనపర్తి రమేశ్, గుజ్జుల సత్యప్రసాద్. వి.వెంకటరమణ, నరేశ్ఉన్నారు. కాగా, మంగళవారం ఐ అండ్ పీఆర్ కమిషనరేట్‌లో జరిగే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ మీటింగ్‌కు హాజరయ్యే సభ్యులకు వినతి పత్రం అందజేద్దామని ఉపేందర్ పిలుపునిచ్చారు.
