బీసీలు, మహిళలకు బీఆర్ఎస్​ అన్యాయం చేసింది : డీకే అరుణ

బీసీలు, మహిళలకు బీఆర్ఎస్​ అన్యాయం చేసింది : డీకే అరుణ

బీఆర్ఎస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో బీసీలకు 22 సీట్లు మాత్రమే కేటాయించడంపట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. ఆగస్టు 22న హైదరాబాద్​లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ ప్రకటించిన ఎమ్మెల్యేల అభ్యర్థులపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే తిరిగి టికెట్టు కేటాయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్​కు తన కుమార్తె కల్వకుంట్ల కవిత తప్పా ఏ మహిళపై విశ్వాసం, గౌరవం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తుండగా బీఆర్​ఎస్​ సర్కార్​ వారిని పూర్తిగా విస్మరించిందని.. ఆ విషయం ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్​ప్రకటనతో తేటతెల్లమైందన్నారు. 

ALSO READ : పుట్టినరోజున మనవరాలితో.. వైరలవుతున్న చిరు, క్లింకార ఫొటో

బీసీలు, మహిళలకు సీఎం కేసీఆర్​ తీరని అన్యాయం చేశారని.. అధికార పార్టీ, కాంగ్రెస్​ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆమె ఆరోపించారు. 

వనితలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీర్​పేటలో జరిగిన ఘటనపై సీఎం కార్యాలయ మహిళాధికారులు సైతం స్పందించకపోవడం సిగ్గు చేటని అన్నారు. 

బీఆర్​ఎస్​ప్రజాప్రతినిధులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని పబ్లిక్​ సమస్యలు పరిష్కరించడం చేతకావట్లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పులపాలు చేస్తున్నా, మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రశ్నించాల్సిన అధికారులు బీఆర్​ఎస్​ నేతలకు వంత పడుతుండటం బాధాకరమని అన్నారు.