కేటీఆర్‌‌‌‌... నీ దోస్త్ ఎవరో చెప్పు?

కేటీఆర్‌‌‌‌... నీ దోస్త్ ఎవరో చెప్పు?

కేటీఆర్‌‌‌‌... నీ దోస్త్ ఎవరో చెప్పు?
రాష్ట్రంలో రోడ్లు, కరెంట్‌‌ ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్త : బీజేపీ నేత డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు : మంత్రి కేటీఆర్ తన ఫ్రెండ్‌‌ ఎవరో చెప్తే, తాను స్వయంగా అతడిని గద్వాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తీసుకెళ్లి, అక్కడ రోడ్లు, నీళ్లు, కరెంట్‌‌ సరఫరా ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్తానని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. కేటీఆర్ స్నేహితుడు కేవలం కల్వకుంట్ల వారి ఫాంహౌస్‌‌ చుట్టుపక్కల ప్రాంతాలు చూసి, రాష్ట్రం మొత్తం అదేవిధంగా ఉంటుందన్న భ్రమలో ఉన్నట్టున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. దానికి తోడు కేటీఆర్‌‌‌‌ సొంత డబ్బా కొట్టుకోవడంలో సిద్ధ హస్తుడన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.