బెంగళూర్: కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, జూన్ 3వ తేదీన కర్నాటక 25వ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూర్‌లోని లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర సీనియర్ నాయకులు, కేబినెట్ సహచరులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
కర్నాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. గవర్నర్ కూడా సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. దీంతో డీకే శివకుమార్‌కు కర్నాటక సీఎం పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
సీఎల్పీ భేటీ నిర్వహించి డీకేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరనున్నారు. 2026, జూన్ 3వ తేదీ నుంచి కర్నాటక రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది.
