కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలకు ఫుల్స్టాప్ : డీఎంఈ నరేంద్ర కుమార్

కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలకు ఫుల్స్టాప్ : డీఎంఈ నరేంద్ర కుమార్
  •     రెగ్యులర్ పోస్టుల భర్తీ తో డీఎంఈ కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య విద్యా శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను ఇకపై కొనసాగించబోమని డీఎంఈ నరేంద్ర కుమార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 776 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను ప్రభుత్వం ఇటీవలే ఎంఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌బీ ద్వారా భర్తీ చేసింది.

రెగ్యులర్ ఉద్యోగులకు అపాయింట్‌‌‌‌మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేయడంతో.. ఆయా స్థానాల్లో ఇప్పటివరకు పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఇకపై కొనసాగించేది లేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, హాస్పిటల్స్ సూపరింటెండెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. రెగ్యులర్ పద్ధతిలో కొత్తవారు విధుల్లో చేరనుండటంతో.. ఆ ప్లేసుల్లో ఉన్న కాంట్రాక్ట్ సిబ్బందిని నిలిపివేసి, తీసుకున్న చర్యలపై వెంటనే నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు.