ఓటమికి బాధ్యత నాదే.. డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్

ఓటమికి బాధ్యత నాదే.. డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయం 'అన్నా అరివాలయం'లో జిల్లా కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, ఓటమికి గల కారణాలపై 20 రోజుల్లోగా నివేదిక సమర్పించేందుకు ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

గత ఐదేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ‘‘పార్టీ నాయకుడిగా ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకుంటాను. విజయం వచ్చినప్పుడు గర్వంగా భావించినట్లే, వైఫల్యం ఎదురైనప్పుడు ఇతరులను నిందించకుండా బాధ్యత వహించడమే న్యాయం” అని ఆయన అన్నారు.