బ్లాక్​ కాఫీ, డార్క్​ చాక్లెట్​ ఇష్టమా?

బ్లాక్​ కాఫీ, డార్క్​ చాక్లెట్​ ఇష్టమా?

బ్లాక్​ కాఫీ, డార్క్​ చాక్లెట్​ ఇష్టమా? అయితే.. మీ జీన్స్​లోనే కాఫీ, చాక్లెట్​లు ఉన్నట్టు లెక్క. ఈ రెండూ లైక్​ చేసేవాళ్ల గురించి అమెరికాలో ఓ రీసెర్చ్​ జరిగింది. మార్లిన్​  కార్నెలిస్​ ఫెయిన్​బర్గ్​ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​లో అసోసియెట్​ ప్రొఫెసర్​​. బ్లాక్​ కాఫీ, డార్క్​ చాక్లెట్​ ఇష్టపడే వాళ్ల జీన్స్​​లోనే కాఫీ, చాక్లెట్​లు ఉంటాయంటున్నారు. వీళ్లలో హెల్త్​ ప్రాబ్లమ్స్​ కూడా తక్కువగానే ఉంటాయి అంటున్నారు. రోజుకు ఓ మూడు కప్పుల  బ్లాక్​ కాఫీ తాగేవాళ్లలో గుండె సమస్యలు, పార్కిన్​సన్​, టైప్​ టు డయాబెటిస్​ వంటివి వచ్చే రిస్క్​ తక్కువ. ఈ విషయాన్ని చాలా రీసెర్చ్​లు ప్రూవ్​ చేశాయి. అయితే ఆ కాఫీలో షుగర్​ ఎక్కువ ఉండకూడదు. పాలు, చక్కెర వేసిన కాఫీతో అంత ఉపయోగం ఉండదు. డార్క్​ చాక్లెట్లను కూడా తక్కువ తింటేనే బెటర్. కార్నెలిస్​ చేసిన ప్రయోగంలో కాఫీ ఎక్కువగా తాగే వారిలో ఒక జెనెటిక్​ వేరియంట్​ కనుగొన్నారు. వీళ్లంతా ఒక కప్పు కాఫీతో ఆగే రకం కాదు. కనీసం రోజుకు మూడు నుంచి అయిదు కప్పులు లాగించాల్సిందే. ఇలాంటి వాళ్ల ఈ జీన్​ వేరియెంట్​ యాక్టివ్​గా కనిపించింది. వీళ్లు డార్క్​ చాక్లెట్లను కూడా ఇష్టపడ్డారట. డార్క్​ చాక్లెట్​, బ్లాక్​ కాఫీ మైండ్ చురుగ్గా పనిచేసేలా చూస్తాయి. బ్రెయిన్​ను బూస్టప్​ చేస్తాయి. దీనికి కారణం వాటిల్లో ఉండే చిన్నపాటి చేదు. ఆ రుచే అడిక్షన్​కు కారణం.