
ప్రభాస్ హీరోగా మహనటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). భారీ అంచనాలతో రూపోందుతున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
All the forces come together for a better tomorrow on ??-??-????.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024
వాస్తవానికి ఈ సినిమాను ముందుగా మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ లోక్ సభ ఎన్నికలతో పాటుగా పలు కారణల వలన సినిమా రిలీజ్ డేట్ ను మార్చేశారు. తాజాగా కొత్త డేట్ ను ప్రకటించార. సైన్స్ ఫిక్షన్ కథతో, పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించనున్నారు. కమల్‌హాసన్ విలన్ పాత్రలో కనిపించనునన్నారు.
కాగా ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుంది. దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపస్తుంది. అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.