కోడ్ అయిపోగానే ఇండ్ల మంజూరు.. శ్రీధర్ బాబు 

కోడ్ అయిపోగానే ఇండ్ల మంజూరు.. శ్రీధర్ బాబు 

పెద్దపల్లి :  ఎన్నికల కోడ్ అయిపోగానే అర్హులకు ఇండ్లు లేని నిరు పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి  పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ  ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ  తనను ఆశీర్వదించి  ఎమ్మెల్యేగా గెలిపించినట్లుగానే వంశీని కూడా గెలిపిస్తే ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానన్నారు. రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చిన గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయకుంటే 2028 లో ఎలక్షన్లలో  నిలబడనని ప్రకటించారు.  రుణమాఫీ  ఆగస్టు 15 వరకు అమలు చేస్తామంటే  హరీశ్ రావు దొంగ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.  అన్ని హామీలు నెరవేర్చితేనే రిజైన్​ చేస్తానని మళ్లీ తొండి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయకుంటే 2028 లో ఎలక్షన్లలో  నిలబడనని లక్ష కోట్లతో కట్టిన మేడిగడ్డ కుంగిపోయిందని అవే పైసలను సంక్షేమ పథకాలకు పెడితే పేదలకు లబ్ధి చేకూరేదన్నారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రజాధనం వృథా అయిందన్నారు.   తమను అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు.  కాంగ్రెస్​ సంక్షేమ పథకాలు అమలు చూసి భయపడుతున్నారన్నారు. అభివృద్ధిలో ఇప్పటివరకు జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపెట్టామని, ముందు ముందు 70ఎంఎంలో చూపిస్తామన్నారు. 

నన్ను శ్రీధర్​ బాబే నిలబెట్టారు

ప్రజలకు సేవ చేస్తానని నమ్మి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరపున  పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తనను మంత్రి శ్రీధర్​ బాబే నిలబెట్టారని  వంశీకృష్ణ అన్నారు. తనను గెలిపిస్తే  నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాల కోసం పోరాడుతానని చెప్పారు. తనను ఆశీర్వదించి  ఎంపీగా గెలిపించాలని కోరారు.   సర్పంచ్ నుంచి స్పీకర్ స్ధాయికి ఎదిగిన శ్రీపాదారావును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.  తెలంగాణ లో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.  .కాంగ్రెస్ హయాంలోనే రైతులు మేలు జరుగుతుందన్నారు.  సేవ చేసే వారికే ఓటు వేసి గెలిపించాలని సూచించారు.